ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీహెచ్ఎంసీ విభజన.. 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 10:09 PM

ఇప్పటివరకు కలిసి ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జీహెచ్‌ఎంసీ )ను తెలంగాణ ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా విడగొట్టింది. ఇప్పుడు ఉన్న జీహెచ్ఎంసీతోపాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ).. మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)గా విభజిస్తూ.. రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయా కార్పొరేషన్లలో ఉండే జోన్లు, సర్కిళ్లు, వార్డులను కూడా ప్రభుత్వం ఫైనల్ చేసింది. ఈ క్రమంలోనే ఆయా జోన్లలో ఉండే సర్కిళ్లు, వార్డులకు సంబంధించిన మ్యాప్‌లను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది.


మరింత సులభంగా పరిపాలన సాగించడం, అధికారాన్ని వికేంద్రీకరించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీని కొత్తగా మూడు కార్పొరేషన్లుగా విభజించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని సుమారు 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


జీహెచ్‌ఎంసీ చట్టం-1955, సెక్షన్‌-3(1) ప్రకారం ప్రస్తుతం మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ మంగళవారం గెజిట్ రెడీ చేయగా.. ఇవాళ విడుదల చేసింది. బుధవారం నుంచే ఈ మూడు కార్పొరేషన్లు విడివిడిగా తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌‌గా ఆర్వీ కర్ణణ్‌ కొనసాగనుండగా.. కొత్తగా ఏర్పడిన మల్కాజ్‌గిరి కార్పొరేషన్ కమిషనర్‌గా వినయ్.. సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్‌గా శ్రీజనలను నియమించారు.


ఇక పాత జీహెచ్‌ఎంసీని 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులుగా విభజించారు. ఇందులో శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, గోల్కొండ, చార్మినార్‌, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌లను 6 జోన్లుగా నిర్ణయించారు.


జీహెచ్ఎంసీలోని జోన్లు, సర్కిళ్లు


శంషాబాద్‌ జోన్‌ - ఆదిభట్ల, బడంగ్‌పేట్‌, జల్‌పల్లి, శంషాబాద్‌


చార్మినార్‌ జోన్‌ - సంతోష్‌ నగర్‌, యాకత్‌పురా, మలక్‌పేట, చార్మినార్‌, మూసారాంబాగ్‌.


ఖైరతాబాద్‌ జోన్‌ - ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, బోరబండ, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట


రాజేంద్రనగర్‌ జోన్‌ - రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, బహదూర్‌పుర, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, జంగమ్మెట్‌


గోల్కొండ జోన్‌ - గోషామహల్‌, కార్వాన్‌, గోల్కొండ, మెహిదీపట్నం, మాసాబ్‌ ట్యాంక్‌


సికింద్రాబాద్‌ జోన్‌ - కవాడిగూడ, ముషీరాబాద్‌, అంబర్‌పేట్, తార్నాక, మెట్టుగూడ


సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) జోన్లు


శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa