తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 200 లకు పైగా స్థానాల్లో పోటీలో నిలిచిన జనసేన పార్టీ.. ఎట్టకేలకు బోణి కొట్టింది. నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో 14వ వార్డు నుంచి పోటీ చేసిన జనసేన పార్టీ అభ్యర్థి సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. దీంతో జనసేన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తెలంగాణ గడ్డపై మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన జనసేనకు ఇది కీలక విజయంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నేరుగా పాల్గొనక పోయినప్పటికీ, స్థానిక నాయకత్వం, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చేసిన కృషి ఈ విజయానికి దోహదపడింది. ముఖ్యంగా యువత, మార్పు కోరుకునే ఓటర్లు జనసేన వైపు మొగ్గు చూపడం ఈ ఫలితంతో స్పష్టమైంది. ఈ విజయం నేరేడుచర్ల పరిధిలోని జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది. తెలంగాణలో బలపడాలని చూస్తున్న జనసేనకు ఈ వార్డు విజయం ఒక మంచి ఆరంభమని చెప్పవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa