ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలి : ధనరాజ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 16, 2026, 10:47 AM

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా నిజాంపేట్ టెంపుల్ బస్ స్టాప్ లో శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ​ప్రధాన అర్చకులు రాము పంతులు & ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ & ఆలయ చైర్మన్ ధనరాజ్ యాదవ్ గారు మహాశివరాత్రి పురస్కరించుకుని శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం 'ఏ ఏ టీమ్ అవేర్నెస్ అసోసియేషన్' & శ్రీ రామ కృష్ణ నాట్య మండలి వారు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమలు & నాటక ప్రదర్శనలు వీక్షించి వారిని అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ​"ఆ పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలి. శివుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను."ఈ కార్యక్రమంలో ​ఏ ఏ టీమ్ యాక్టర్ శ్రీమతి సాయి లక్ష్మి చంగతి, ​సంగీత దర్శకులు నామ చంద్ర బాబు నాయుడు​ మరియు ఆలయ సభ్యులు,పిచ్చి రెడ్డి, యువకులు రామ్ చరణ్, సాయి భక్తులు, తదితరులు పాల్గొన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa