ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీటి గుంతలో మునిగి గురుకుల విద్యార్థి మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 16, 2026, 11:51 AM

నీటి గుంతలో మునిగి గురుకుల విద్యార్థి మృతి. సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు . యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని పగిడిపల్లిలో ఉన్న తెలంగాణ మైనారిటీ గురుకుల సంక్షేమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం రాయపురం గ్రామానికి చెందిన బాలఆకాశ్(16) అనే విద్యార్థి. తోటి విద్యార్థి రెహమత్ ఖాన్‌తో కలిసి పాఠశాల సమీపంలోని నీటి గుంత వద్దకు స్నానానికి వెళ్లగా, ఒక్కసారిగా గుంతలో పడిపోయిన బాలఆకాశ్ . ఈత రాకపోవడంతో సహాయం కోసం కేకలు వేయగా, నీటిలో దిగి కాపాడే ప్రయత్నం చేసిన రెహమత్ ఖాన్. ఎంత ప్రయత్నించినా బాల ఆకాశ్‌ను కాపాడలేకపోవడంతో, పాఠశాలకు వెళ్లి సిబ్బందికి విషయాన్ని తెలిపిన రెహమత్ ఖాన్. హుటాహుటిన నీటి గుంత వద్దకు వెళ్లి బాల ఆకాశ్‌ను బయటికి తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించిన వైద్యులు . తమ కుమారుడి మృతికి పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆసుపత్రి ముందు ఉన్న రహదారిపై రాస్తారోకోకు దిగిన మృతుడి కుటుంబ సభ్యులు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa