ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్ దుకాణంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ: పారదర్శకతకు ఆదేశాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 18, 2026, 03:41 PM

కామారెడ్డి జిల్లా, సదాశివ నగర్ మండలం తిర్మన్ పల్లి గ్రామంలోని చౌక ధరల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ దుకాణంలో బియ్యం నిల్వలు, పంపిణీ విధానం, స్టాక్ రిజిస్టర్, విక్రయ రికార్డులను పరిశీలించారు. పంపిణీ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, బియ్యం కొరత లేకుండా సమయానికి అందుబాటులో ఉంచాలని, ప్రజలకు అందుతున్న పౌర సరఫరా సేవలు సమర్థవంతంగా అమలవ్వాలని, ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో DM శ్రీకాంత్, సంబంధిత శాఖ అధికారులు, మండల సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa