మహా దివ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో బుధవారం నుంచి 11 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ ఈవో భవానీశంకర్ తెలిపారు. విశేషోత్సవాల్లో భాగంగా ఈ నెల 24న ఎదుర్కోలు, 25న శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం, 26న దివ్యవిమాన రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa