ఇంద్రేశం మున్సిపాలిటీలో BRS పార్టీని దిగ్విజయంగా గెలిపించిన సందర్భంగా మాజీ మంత్రి వర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారిని కలిసిన ఇంద్రేశం మున్సిపాలిటీ ఇన్చార్జి గోసుల శ్రీనివాస్ యాదవ్, కో ఆర్డినేటర్ మెట్టు కుమార్ యాదవ్. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో BRS పార్టీ గెలుపొందిన సందర్భంగా ఈ రోజు మాజీ ఆర్ధిక సంఘం సభ్యులు, ఇంద్రేశం మున్సిపాలిటీ ఇంచార్జీ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు,పటాన్చెరు తాజా మాజీ కార్పొరేటర్, ఇంద్రేశం మున్సిపాలిటీ కో ఆర్డినేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ నమ్మకంతో అప్పజెప్పిన ఇంద్రేశం మున్సిపాలిటీ బాధ్యతలను కర్తవ్యంగా భావించి, స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో మమేకమై, అహర్నిశలు శ్రమించి అత్యద్భుతంగా పార్టీని గెలిపించి, ఇంద్రేశం మున్సిపాలిటీలో BRS విజయ కేతనం ఎగరవేశారని హరీష్ రావు గారు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారిని, మెట్టు కుమార్ యాదవ్ గార్లను అభినందించారు. తాజా మాజీ పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారి సహోదరుడు ఆస్పత్రిలో ఉన్నప్పటికీ అలాగే గోసుల శ్రీనివాస్ యాదవ్ గారి తల్లి గారు కూడా ఆస్పత్రిలో ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో వారు పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడడం నిజంగా అభినందనీయమని కొనియాడారు. ఇదే ఉత్తేజంతో పటాన్చెరు నియోజకవర్గంలో BRS పార్టీని బలోపేతం చేస్తూ రానున్న కార్పొరేషన్ ఎన్నికలలో కూడా BRS పార్టీని దిగ్విజయంగా గెలిపించాలని కోరారు. పార్టీ కోసం కష్టపడి ప్రతి వ్యక్తిని కాపాడుకుంటామని, వారికి సముచితమైన స్థానం తప్పకుండా కల్పిస్తామని హరీష్ రావు గారు హామీ ఇవ్వడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa