బుధవారం, అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి నారాయణగూడ వైఎంసీఏ నుంచి బర్కత్ పురా చమన్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఎం మారుతి దివాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa