గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆయన సతీమణి జ్యోతి గురువారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గద్వాల నియోజకవర్గ ప్రజలు, రైతాంగం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి స్వామివారి ఆశీస్సులు కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పర్యటనలో సర్పంచ్ విజయ్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa