ఉస్మానియా యూనివర్సిటీలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) సెంట్రల్ జోన్ వైస్ చాన్సలర్ల సదస్సు నేడు, రేపు జరగనుంది. ఈ సదస్సును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం సాంకేతికతతో కూడిన ఉన్నత విద్యా సంస్థల రూపకల్పన అనే అంశంపై ఈ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 40 మందికి పైగా వీసీలు, ఉన్నత విద్యా నిర్వాహకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa