ఈరోజు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, నిజాంపేట్ సర్కిల్ 273- నిజాంపేట్ డివిజన్ పరిధి ఇందిరమ్మ కాలనీ ఫేస్-3 బస్తీలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలకు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు,నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ గారు ,మాజీ కార్పొరేటర్ సుజాత గారు ముఖ్యఅతిధులుగా హాజరై ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...విదేశీ పాలనకు ఎదురొడ్డి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన మహాయోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో పద్మ ప్రసాద్, సుబ్బారెడ్డి, మధు, మురళి, బస్తీ వాసులు, బిఆర్ఎస్ నాయకులు తాళ్ళూరి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa