రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ పరిధిలోని మైలర్ దేవ్ పల్లి శివాజీ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ మైలర్ దేవ్ పల్లి డివిజన్ ఆధ్వర్యంలో గురువారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అత్యంత పరాక్రమవంతుడు, హిందూ సామ్రాజ్య స్థాపకుడు, ధైర్యం-వీరత్వానికి ప్రతీకగా నిలిచిన శివాజీ మహారాజ్ జీవితం యువతకు ఆదర్శమని నాయకులు పేర్కొన్నారు. శత్రువును బలహీనంగా భావించవద్దని, అలాగని అతనికి భయపడి మన బలాన్ని తక్కువ అంచనా వేయవద్దని శివాజీ మహారాజ్ తన సైన్యానికి ఉపదేశించిన విషయాన్ని గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa