తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు అనుమతి ఇవ్వగా.. తాజాగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ మాస్టర్ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి తన క్యాంపు కార్యాలయంలో ఎంపీ గోడం నరేష్ ఎయిర్‌పోర్ట్ మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ది చెందుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa