చందానగర్: కూకట్‌పల్లి హ్యాట్రిక్ ఎమ్మెల్యే, శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి మాధవరం కృష్ణారావు జన్మదిన వేడుకలను చందానగర్‌లో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అభిమానుల కోలాహలం మధ్య నవతరెడ్డి పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి, ఎమ్మెల్యే కృష్ణారావుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా బొబ్బ నవతరెడ్డి మాట్లాడుతూ.. మాధవరం కృష్ణారావు లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడి మార్గదర్శకత్వంలో శేరిలింగంపల్లిలో బీఆర్‌ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కృష్ణారావు సమర్థవంతమైన నాయకత్వంలో, కార్యకర్తల కృషితో రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లను కైవసం చేసుకుంటామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటేలా సైనికుల్లా పని చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం అనంతరం వేడుకలకు విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కోసం నిర్వాహకులు భారీ ఎత్తున భోజన ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు, యువజన విభాగం నేతలు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa