ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 10:38 AM

పటాన్చెరు పట్టణంలోని జేపీ కాలనీలో పంచముఖ హనుమాన్ ఆలయం వద్ద, అలాగే పటాన్చెరు మరాఠా సేన, మరియు గొల్ల బస్తీలో శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి మహరాజ్ చిత్రపటాలకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి పూలమాలలు వేసి నమస్కరించారు. ఆయన మాట్లాడుతూ... ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందన్నారు. దేశానికి శివాజీ చేసిన సేవలు మరవలేవన్నారు. దేశం, ధర్మం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం పటాన్చెరు వీధుల గుండా శివాజీ మహారాజ్ చిత్రపటంతో శోభాయాత్ర, బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. ధైర్యానికి, ధీరత్వానికి మరో పేరు శివాజీ అని యూత్ పేర్కొన్నారు. సమాజ హితం కోసం పని చేసిన శివాజీ మహరాజ్ ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భజరంగళ్‌, విశ్వహిందూ పరిషత్‌, హిందూ జనజాగృతి, హిందూ వాహిని సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa