ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒవైసీ సోదరులపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 03:59 PM

మజ్లిస్ పార్టీ, ఒవైసీ సోదరులపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు 15 నిమిషాలు అడిగారు, కానీ నాకు ఐదు నిమిషాల సమయం ఇచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజాసింగ్ మాట్లాడుతూ, తమకు 15 నిమిషాల సమయం ఇస్తే హిందువులు లేకుండా చేస్తానని అన్నారని మండిపడ్డారు.15 నిమిషాలు కాదు 15 గంటలు, 15 రోజులు, 15 నెలలు అవసరమైతే 15 సంవత్సరాలు ఇచ్చినా మీరేం చేయలేరని అన్నారు. మీ పూర్వీకులే హిందువులను ఏం చేయలేకపోయారు మీరేం చేస్తారని మండిపడ్డారు. కానీ తమకు ఐదు నిమిషాల సమయం ఇవ్వాలని అన్నారు. తాను ఎక్కడకు రావాలో చెప్పాలని అన్నారు. నీ ప్రాంతానికి రావాలా, నీ ఇంటికి రావాలా, ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తానని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa