ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శోభాయాత్రలో బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 04:16 PM

 పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీ వీర శివాజీ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆల్విన్ కాలనీలోని మల్లన్న స్వామి దేవాలయం వద్ద నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొని, స్థానిక ప్రజలతో కలిసి దేశభక్తి నినాదాలు చేశారు. తదుపరి రామచంద్రపురం లోని SN కాలనీలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొని శివాజీ మహారాజ్ ఆశయాలను స్మరించుకున్నారు.పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, స్వరాజ్య స్థాపనలో ఆయన చూపిన అచంచల సంకల్పం, ప్రజా పరిపాలనలో న్యాయం మరియు సమానత్వానికి ఇచ్చిన ప్రాధాన్యతను ప్రస్తావించారు.యువత శివాజీ మహారాజ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa