ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేతులతోనే చంపేస్తా.. ఓవైసీ బ్రదర్స్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 11:20 PM

బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో పెను సంచలనంగా మారాయి. మరాఠా ఛ‌త్రప‌తి శివాజీ మహారాజ్ జ‌యంతి వేడుక‌ల్లో భాగంగా గురువారం వ‌రంగ‌ల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాజాసింగ్.. ఎంఐఎం పార్టీ అగ్రనేతలు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సెక్యూరిటీ లేకుండా వస్తే.. ఎవరి సత్తా ఏంటో చూపిద్దాం అంటూ బహిరంగ సవాల్ చేశారు.


ప్రతీ సభలో 15 నిమిషాలు అంటూ ఓవైసీ బ్రదర్స్ కామెంట్లు చేస్తున్నారన్న రాజాసింగ్.. 15 నిమిషాలు కాకుండా 15 ఏళ్లు స‌మ‌యం ఇచ్చినా వాళ్లు ఏమీ చేయ‌లేర‌ని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. ఓవైసీ బ్రదర్స్‌కు ద‌మ్ముంటే 15 నిమిషాలు కాదని.. తనకు 5 నిమిషాలు చాలు అని తెలిపారు. అవే డైలాగ్‌లు మళ్లీ మళ్లీ చెబుతూ టైమ్ పాస్ చేయడం మానుకోవాలని రాజాసింగ్ హితవు పలికారు. ఇదే విషయం గ‌తంలో కూడా తాను చెప్పాన‌ని.. మళ్లీ ఇప్పుడు కూడా చెబుతున్నాన‌ని పేర్కొన్నారు. ఓవైసీ బ్రదర్స్ సెక్యూరిటీ లేకుండా రావాలని.. తాను కూడా సెక్యూరిటీ లేకుండా వ‌స్తాన‌ని సవాల్ విసిరారు.


త‌న‌కు తుపాకులు, క‌త్తులు వ‌ద్దని.. తన చేతుల‌తోనే చంపేస్తానంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణం అవుతున్నాయి. ప్లేస్ ఎక్కడో మీరే డిసైడ్ చేయండి అంటూ ఓవైసీ బ్రదర్స్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీ అడ్డాకు రావాలా లేక మీ ఇంటికే రావాలా అంటూ కామెంట్లు చేశారు. దమ్ముంటే ప్లేస్ మీరే డిసైడ్ చేయాల‌ని ఓవైసీ బ్రదర్స్‌కు ఛాలెంజ్ విసిరారు. ఆ 5 నిమిషాల్లో తామేంటో ప్రత్యక్షంగా చూపిస్తానని అక్బరుద్దీన్ ఒవైసీకి రాజాసింగ్ బహిరంగ సవాల్ విసిరారు. డేట్, టైమ్, ప్లేస్ అన్నీ నువ్వే డిసైడ్ చేయ్.. ఎక్కడికైనా రావడానికి తాను రెడీగా ఉన్నానని తెలిపారు.


హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా గతంలో అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడారని.. దానికి జవాబు చెప్పే రోజు దగ్గర్లోనే ఉందంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఓవైసీ బ్రదర్స్ రాజకీయాలు ఓల్డ్ సిటీ దాటి బయటికి రావడం లేదని విమర్శలు చేశారు. రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలకు సభకు వచ్చిన యువతను ఉర్రూతలూగించాయి. రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


ఒక‌ప్పుడు భారత్‌పై ఉగ్రదాడి జ‌రిగితే పాకిస్తాన్‌కు ల‌వ్ లెట‌ర్ రాసేవాళ్లని ఎద్దేవా చేసిన రాజాసింగ్.. కానీ ఇప్పుడు మాత్రం నేరుగా స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ చేసే ప్రభుత్వం ఉంద‌ని గత ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఛ‌త్రప‌తి శివాజీ నుంచే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స‌ర్జిక‌ల్ స్ట్రైక్ నేర్చుకున్నార‌ని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa