ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంత్ గురు రవిదాస్ బోధనలు స్ఫూర్తిదాయకం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 11:04 AM

రామచంద్రాపురం : సమాజంలో అసమానతలు తొలగించడానికి సంత్ గురు రవిదాస్ చేసిన బోధనలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీలో గల సంత్ శ్రీ గురు రవిదాస్ దేవాలయంలో ఏర్పాటు చేసిన సంత్ రవి దాసు 649 జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంత్ రవి దాసు బోధనలు సమాజంలో సమానత్వం, ప్రేమను పెంపొందించాయని అన్నారు. కుల రహిత సమాజం, మానవతవాదం కోసం ఆయన చేసిన బోధనలు చిరస్మరణీయమన్నారు.పటాన్చెరు నియోజకవర్గంలో మోచి కులస్తుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మోచి కులస్తులకు తగు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పుష్ప నగేష్, అంజయ్య,  పరమేశ్ యాదవ్, ఐలేష్ యాదవ్, మోచి సంఘం రామచంద్రపురం చైర్మన్ దశరథ్, ముఖ్య సలహాదారు నర్సింగ్ రావు, అధ్యక్షులు తానాజీ, శివరాజ్, అంబదాసు, శ్రావణ్ కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa