ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేడారం జాతరకు యునెస్కో గుర్తింపు తేవాలి: సీతక్క

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 03:07 PM

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేయాలని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్‌ను మంత్రి సీతక్క కోరారు. అందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయంగా జాతరకు విశేష గుర్తింపు లభించేలా విస్తృత ప్రచారం కల్పించిన ట్రస్ట్‌ను ఆమె అభినందించారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగిన ఈ జాతరకు 2 కోట్ల మందికి పైగా హాజరయ్యారు.అంతర్జాతీయంగా మేడారం జాతరకు విస్తృత ప్రచారం కల్పించడంలో విశేష కృషి చేస్తున్న కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ను మంత్రి సీతక్క అభినందించారు. ప్రముఖ చలన చిత్ర దర్శకుడు బీ.నర్సింగరావు మేడారం జాతరకు సంబంధించి అత్యంత అరుదైన ఛాయా చిత్రాలతోపాటు సమగ్ర సమాచారం జోడించి ఈ పుస్తకాన్ని సంకలనం చేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa