ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మున్సిపల్ కమిషనర్‌కు వైస్ చైర్‌పర్సన్ తిరుపతిని సన్మానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 02:54 PM

కాగజనగర్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ బి. తిరుపతిని వైస్ చైర్‌పర్సన్ డా. కొత్తపల్లి అనిత, ఆమె భర్త డా. కొత్తపల్లి శ్రీనివాస్‌తో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా కమిషనర్‌కు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల మెరుగుదల వంటి అంశాల్లో కమిషనర్ చేపడుతున్న చర్యలను అభినందిస్తూ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి ప్రజా సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తామని తెలిపారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa