హైదరాబాద్ జూబ్లీహిల్స్ మెట్రోస్టేషన్ సమీపంలోని ఓ బిల్డింగ్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళగౌరి వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. బిల్డింగ్ ముందు భాగంలో మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఫైరింజన్లతో నీళ్లు చల్లుతూ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa