మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్‌గా ఎన్నికైన శ్రీమతి మమతా శ్రీనివాస్‌ను జడ్చర్ల తాలూకా ముదిరాజ్ మహాసభ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. మహబూబ్‌నగర్‌లోని వారి స్వగృహంలో మేయర్‌ను కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెన్నయ్య, లక్ష్మయ్య, శేఖర్, హనుమాన్, నర్సింహులు, రవి, కృష్ణ, రాజు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa