గురువారం గాంధీ ఆస్పత్రి ఆవరణతో పాటు పరిసర ప్రాంతాల్లో చిలకలగూడ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో, నీళ్లు, తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇద్దరు అనాథలను పోలీసులు గుర్తించారు. వెంటనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు శ్రీనివాస్ గుప్తా సహాయంతో, ఒక అనాథను అనంతశ్రమానికి, మరొకరిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రిలో చేర్పించినట్లు ఏసిపి శశాంక్ రెడ్డి తెలిపారు. ఈ సంఘటన ఆస్పత్రి పరిసరాల్లోని అనాథల దుర్భర పరిస్థితిని వెలుగులోకి తెచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa