ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్ సుప్రీం లీడర్ మరణంతో శ్రీనగర్‌లో నిరసనలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 01, 2026, 02:12 PM

అమెరికా-ఇజ్రాయెల్ బాంబు దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారన్న వార్తలతో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ఆదివారం ఈ విషయం నిర్ధారణ కావడంతో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. దీంతో కశ్మీర్ లోయ వ్యాప్తంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.శ్రీనగర్‌లోని సైదా కడల్, లాల్ చౌక్ సహా పలు ప్రాంతాల్లో నిరసనకారులు శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లాల్ చౌక్ వద్ద నల్ల జెండాలతో గుమిగూడిన ఆందోళనకారులు ఖమేనీ మృతి పట్ల తమ సంతాపం తెలిపారు. నిరసనల కారణంగా పలుచోట్ల ట్రాఫిక్‌ను అధికారులు మళ్లించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa