ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టోలీచౌకీలో ఘోర ప్రమాదం.. 5 అంతస్థుల భవనం కూలి నలుగురు మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 06:09 PM

హైదరాబాద్‌లో మరో విషాదకరమైన ఘటన జరిగింది. టోలీచౌకీ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో అక్కడే పనిచేస్తున్న నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటనలో మరింత మంది కార్మికులకు కూడా తీవ్ర గాయాలు కావడంతో.. వారిని హుటాహుటిన దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నారు. టోలీచౌకీ అల్ హస్నాత్ కాలనీలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్థుల భవనం కూలిపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిలో కొందరు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.


ఇక భవనం కూలిన ఘటనకు సంబంధించిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు, సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన సహాయక చర్యలు మొదలుపెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కొత్త భవనానికి గోవా కర్రలు కట్టి.. వాటిపై నిలబడి కార్మికులు పనులు చేస్తుండగా.. అకస్మాత్తుగా ఆ కట్టెలు కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు ఎవరు, వారి వివరాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa