ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాలనీల అభివృద్ధికి సంపూర్ణ సహకారం : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 09, 2026, 12:23 PM
అమీన్పూర్ :అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. 

అమీన్పూర్ డివిజన్ పరిధిలోని శంకర్ గ్రీన్ హోమ్స్ లో ఆదివారం ఎమ్మెల్యే జిఎంఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో సమావేశమై వారి ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గతంలో కాలనీవాసులకు ఇచ్చిన హామీ మేరకు సీసీ రోడ్డు వేయించడం జరిగిందని గుర్తు చేశారు. విద్యుత్ సమస్యను సైతం పరిష్కరించేందుకు అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయినప్పుడే ప్రగతి మరింత ముందుకు వెళుతుందని తెలిపారు. అనంతరం నవ్య రోడ్డు లో నిర్మిస్తున్న ముదిరాజ్ భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరితగతిన భవనం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. భవనం సమీపంలోనే నిర్మిస్తున్న ఆంజనేయస్వామి, అష్టలక్ష్మి దేవాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్దేశించిన గడువులోగా దేవాలయ పనులు పూర్తి చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్  పాండురంగారెడ్డి, అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం,  అమీన్పూర్ మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఏడి సంజయ్, ఇంజనీరింగ్ విభాగం డి ఈ వెంకటరమణ, మాజీ కౌన్సిలర్లు చంద్రకళ గోపాల్, కృష్ణ, దాసు, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa