కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం మూడు దశల పోరాటానికి సిద్ధమయ్యారు. కేజీబీవీ, యుఆర్ఎస్, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంఘం జిల్లా అధ్యక్షురాలు శృతిక డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సోమవారం వాంకిడి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, మండల విద్యా వనరుల కేంద్రం వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మార్చి 16న జిల్లా కేంద్రాల్లో, మార్చి 20న చలో అసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa