పటాన్చెరు : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు వయస్సు గల ఆడపిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ నాగలక్ష్మి, ఆస్పత్రి సూపరిండెంట్ చంద్రశేఖర్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కంకర శీనయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa