ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త అందించింది. బస్సు ఛార్జీలను తగ్గించింది. ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో పెంచేందుకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిధిలో నడిచే మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ బస్సుల టికెట్ ధరలను తగ్గించారు. ఈ నిర్ణయం ద్వారా ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీ బస్సులను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa