నేడు బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి అని చెప్పుకోవాలి. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో బులియన్ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిన్నటి సెషన్‌లో దాదాపు 2 శాతం పెరిగిన పసిడి, 4 శాతం దూసుకెళ్లిన వెండి నేడు స్వల్పంగా తగ్గాయి.ఈ రోజు ఉదయం 11:15 గంటల సమయంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.52శాతం నష్టపోయి 10 గ్రాములకు రూ. 1,62,452 వద్ద ట్రేడ్ అయింది. అలాగే, మే సిల్వర్ ఫ్యూచర్స్ 1.69 శాతం క్షీణించి కిలోకు రూ. 2,73,150 వద్దకు చేరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa