షాద్ నగర్ పట్టణంలోని 23వ వార్డులో బుధవారం లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వం అందజేశారు. ప్రభుత్వం నిరుపేదల కోసం నిర్మించిన ఈ ఇళ్లను అర్హులందరికీ అందిస్తున్నామని, భవిష్యత్తులోనూ ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన తెలిపారు. 99 రోజుల ప్రగతి ప్రణాళిక ద్వారా వార్డుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, షాద్ నగర్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa