ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 02:58 PM

సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు (91) కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది. 1989, 1994 ఎన్నికల్లో సీపీఎం తరపున వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.సామాన్య కుటుంబంలో జన్మించిన రాములు రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేసినప్పటికీ తన జీవితాంతం ఒక సామాన్యుడిగానే గడిపారు. ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజా సేవకే అంకితమైన ఆయన ప్రస్థానం భావితరాలకు స్ఫూర్తి. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం, ముఖ్యంగా అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది.ఆయన మృతి పట్ల అటు రాజకీయ వర్గాలు, ఇటు ఇబ్రహీంపట్నం ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa