షాద్‌నగర్ పట్టణం భగీరథ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీఓ ఏజెంట్ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన సేవలను సులభంగా అందించేలా ఇలాంటి కార్యాలయాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అనంతరం యాజమాన్యం కృష్ణ, రమేష్‌లకు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ ఎంపీటీసీ కాట్న శ్రీశైలం, నాయకులు రవి యాదవ్, పాష, సంతోష్, రమేష్, టి. రమేష్, వెంకటేష్, శేఖర్, రాకేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa