ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారతి బిల్డర్స్‌పై ‘రెరా’ సీరియస్.. బయటపడ్డ అక్రమాలపై యాక్షన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 09:44 PM

Kompallyలోని భారతి లేక్ వ్యూ అపార్ట్‌మెంట్స్ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు రుజువయ్యాయి. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్న Bharathi Builders Private Limitedపై Telangana Real Estate Regulatory Authority (టీజీ రెరా) కఠిన చర్యలు తీసుకుంది.కొనుగోలుదారులు చేసిన ఫిర్యాదులను పరిశీలించిన అథారిటీ, బిల్డర్ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. 2021లో ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరిట కొనుగోలుదారుల నుంచి భారీగా నిధులు సేకరించినట్లు తేలింది. ప్రాజెక్టును 24 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆ హామీని నెరవేర్చలేకపోయినట్లు వెల్లడైంది.అదేవిధంగా, అవసరమైన చట్టబద్ధ అనుమతులు మరియు రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే డబ్బులు సేకరించడం, ఇప్పటివరకు నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంపై అథారిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితులు కనిపించకపోవడంతో కొనుగోలుదారులు ఈ ప్రాజెక్టులో కొనసాగాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.బాధితులు చెల్లించిన మొత్తాన్ని Telangana Real Estate Rules 2017లోని రూల్ 15 ప్రకారం వడ్డీతో సహా 60 రోజుల్లో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ప్రాజెక్టు అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్న మరో శ్రీ భారతి సంస్థను కూడా ప్రమోటర్‌గా పరిగణించి, సంబంధిత సంస్థలు కలసి ఈ మొత్తాన్ని చెల్లించాలని తీర్పునిచ్చింది.ఈ వ్యవహారంలో చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించినందుకు భారతి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను “డిఫాల్టర్ ప్రమోటర్”గా ప్రకటించారు. అంతేకాకుండా రూ.3,55,63,297 జరిమానా విధించారు. గతంలో ఇదే ఉల్లంఘనలపై విధించిన రూ.1,18,54,432 జరిమానాతో కలిపి మొత్తం పెనాల్టీ రూ.4,74,17,729కు చేరిందని అథారిటీ వెల్లడించింది.
*ప్రీ-లాంచ్ ఆఫర్లపై హెచ్చరిక : రెరా రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టుల్లో ప్రీ-లాంచ్ ఆఫర్లు లేదా ప్రత్యేక స్కీమ్‌లు నిర్వహించడం చట్ట విరుద్ధమని అధికారులు మరోసారి స్పష్టం చేశారు. అలాంటి స్కీమ్‌లను నమ్మవద్దని, వాటిలో పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కొనుగోలుదారులను హెచ్చరించారు.ఇలాంటి పథకాల ద్వారా రియల్ ఎస్టేట్ చట్టం కల్పించే రక్షణలు కొనుగోలుదారులకు అందవని తెలిపారు. రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టులకు రెరా పర్యవేక్షణ ఉండదని, అలాగే ‘ఎస్క్రో’ బ్యాంకు ఖాతా వంటి ఆర్థిక భద్రతలు కూడా వర్తించవని పేర్కొన్నారు. అందువల్ల ఏదైనా ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే ముందు, ఆ ప్రాజెక్టు రెరా రిజిస్ట్రేషన్ వివరాలను అధికారిక పోర్టల్‌లో తప్పనిసరిగా పరిశీలించాలని అథారిటీ సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa