ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాల వ్యాన్ బోల్తా... ఇద్దరికి స్వల్ప గాయాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 16, 2026, 02:01 PM

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని జిల్లేల్లిగడ్డ సమీపంలో సోమవారం ఉదయం ఓ పాల వాహనం బోల్తా పడింది. సిద్దిపేట నుంచి హుజురాబాద్ కు వెళ్తున్న పాల వ్యాన్ వెనుక టైరు ఊడిపోవడంతో వాహనం అదుపుతప్పి, రోడ్డు పక్కన కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa