రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని పటాన్‌చెరు పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో ఉన్న మస్జిద్-ఎ-అబూబకర్ సిద్దీక్ మస్జిద్లో బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులతో కలిసి ఆయన ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొని ఐక్యత, సౌభ్రాతృత్వానికి నిదర్శనంగా నిలిచారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. గంగా–జమునా తహజీబ్ సంస్కృతిని ప్రతిబింబిస్తూ అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తూ సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. సమాజంలో శాంతి, సహనం, పరస్పర గౌరవం పెంపొందించడంలో రంజాన్ మాసం ముఖ్యమైన సందేశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఉపవాస దీక్షలో ఉన్నవారికి ఇఫ్తార్ విందు మరియు భోజనాలను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో మత పెద్దలు, స్థానిక ప్రజలు, యువకులు మరియు MPR యువసేన సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa