ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఛార్జీలను 1.5 రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 17, 18, 23 తేదీల్లో ప్రత్యేకంగా నడిచే రూట్లలోని ప్రత్యేక బస్సులకు మాత్రమే ఈ సవరించిన ఛార్జీలు వర్తిస్తాయని వివరించింది. అయితే, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం యథావిధిగా కొనసాగుతుంది. ముందస్తు రిజర్వేషన్ల కోసం www.tgsrtcbus.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa