ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డివిజన్ లో మౌలిక వసతులు కల్పించడమే నా లక్ష్యం... కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 20, 2026, 10:36 AM

శేరిలింగంపల్లి డివిజన్... సందయ్య నగర్ లో నూతనంగా నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్డు ను ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానికవాసులతో కలిసి ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డివిజన్ లోని ప్రతి కాలనీలలో, బస్తీల్లో గుంతలమయం లేకుండా సౌకర్యవంతమైన సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి స్థానికవాసులకు వెసులుబాటుగా ఉండేందుకు కోట్లాడి రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లను వేయిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.సీసీ రోడ్లు, త్రాగునీరు, వీధి లైట్లు, డ్రైనేజీ వ్యవస్థ, విధ్యుత్, పారిశుధ్యం వంటి సమస్యలను ఎమ్మెల్యే గారి సహకారంతో అధిగమించామని ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువచ్చినట్లైతే తక్షణమే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాడుతానని హామీ ఇచ్చారు.


కార్పొరేటర్ గారి సొంత ఖర్చులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గుడి, బడి నిర్మించి స్థానిక నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ.. అందులో భాగంగా సైయింట్ ఫౌండేషన్ ద్వారా సెమీ స్కిల్ సెంటర్ లో రెండు వేల పై చిలుకు మహిళలకు వివిధ కోర్స్ లలో శిక్షణ కల్పించి వారికీ ఉపాధి కల్పించానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీకళ, సందయ్య నగర్ అధ్యక్షులు బస్వరాజ్, SLVDC ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, ఆరంభ టౌన్షిప్ మాజీ అధ్యక్షులు బసవయ్య, కోదండరావు, సురభి కాలనీ మాజీ అధ్యక్షులు చంద్రశేఖర్, సబినా కుమారి, నీలకంఠ రెడ్డి, సౌజన్య, కల్యాణి, జయ, రాములమ్మ,  కుటుంబరావు, నరసింహ రెడ్డి, నెంరామ్ చౌదరి, బలరాం వర్మ, సాంబశివరావు, శిరీష, డాక్టర్ మధు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, అఫ్రీన్, లక్ష్మి జయలక్ష్మి స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa