ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రికెట్ టోర్నమెంట్ సీసన్-1 ప్రారంభించిన జగదీశ్వర్ గౌడ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 20, 2026, 02:16 PM

మియాయర్ మెట్రో గ్రౌండ్” లో 20-22 వరకు *మియాపూర్ క్రికెట్ అసోసియేషన్* వారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ సీసన్-1 ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని “టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్” *వి.జగదీశ్వర్ గౌడ్* గారు ప్రారంభించటం జరిగింది. ప్రారంభోత్సవం తదుపరి యువతతో కలిసి క్రికెట్ అడి, టోర్నమెంట్ లో పాల్గొన “టీం సభ్యులు” అందరికి అభినందనలు తెలిపారు.అనంతరం “శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది” శుభసందర్భంగా “ఆల్విన్ కాలనీ 124 డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు” *పట్వారీ శశిధర్* గారు *వి.జగదీశ్వర్ గౌడ్* గారిని మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించి *శ్రీ పరాభవ నామ సంవత్సర*(తెలుగు నూతన సంవత్సర ఉగాది) శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కావూరి ప్రసాద్,యలమంచి ఉదయ్ కిరణ్, కట్ల శేఖర్ రెడ్డి,రవి కుమార్, శ్రీనివాసులు,నాగయ్య,సంగమేష్, అగ్ర వాసు, క్యాటరింగ్ వాసు,బాబ్జి మరియు *టీం పట్వారీ* తదితరులు పాల్గొన్నారు...


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa