ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రంజాన్ వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 21, 2026, 02:14 PM

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని చందపల్లి శివారు ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే విజయరమణరావు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నెలరోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే ఈ పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనమని, రంజాన్ మాసం క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన, దాతృత్వం, ప్రేమ, దయ, సోదర భావం, ఐక్యతను పెంపొందిస్తుందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa