తెలుగు రాష్ట్రాలను కలిపే విజయవాడ-కాజీపేట రైల్వే మార్గంలో మూడో లైన్ ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది. 219 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టులో 199 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం, విద్యుదీకరణ పూర్తయ్యాయి. ఈ కొత్త లైన్ వల్ల రైళ్ల రద్దీ తగ్గి, ప్రయాణీకుల రైళ్లు సమయానికి నడుస్తాయి. బొగ్గు, సిమెంట్ వంటి సరుకుల రవాణా వేగవంతమై, పరిశ్రమలకు ముడి సరుకులు త్వరగా అందుతాయి. వంద శాతం విద్యుదీకరణతో ఇంధన ఖర్చులు, కాలుష్యం తగ్గుతాయి. ఈ మార్గం త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa