ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దొంగల టార్గెట్ గా తాళాలు వేసిన ఇళ్లు, ఆలయాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 08, 2026, 12:32 PM

శంకరపట్నం, హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లోని పట్టణాలు, గ్రామాల్లో తాళాలు వేసిన ఇళ్లు, ఆలయాలను దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. దొంగలు వాడవాడలా తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాలను తొలగించే మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. దొంగతనాలు అరికట్టేందుకు హుజూరాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసులు నేర చరిత్ర ఉన్న వ్యక్తుల గ్రామాల్లో ఆరా తీస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa