ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి చెరువు నిండాలి - ప్రతి గుంటకు సాగునీరు అందాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 16, 2026, 02:18 PM

దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, గురువారం నల్గొండ జిల్లా పీఏ పల్లి మండల పరిధిలోని ఏకేబిఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా నిర్మిస్తున్న మెయిన్ డెలివరీ సిస్టర్న్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఏకేబీఆర్ లిఫ్ట్ స్కీము ద్వారా దేవరకొండ నియోజకవర్గంలోని 2082 ఎకరాలకు నీరందించేందుకు రూ. 90.96 కోట్లతో పనులు మంజూరయ్యాయని, మొత్తం 6691 ఎకరాలకు నీరందించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa