ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదుపుతప్పి చెట్టును ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 17, 2026, 10:22 AM

TG: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి యాద్గార్‌పల్లి చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. అతి వేగంగా వెళ్తున్న బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను గబ్బిలాల్‌పేట్ ప్రాంతానికి చెందిన కాకరాజు, అరుణ్‌గా గుర్తించారు. వీరు జవహర్‌నగర్‌లో వాషింగ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa