గ్రూప్ సీ పోస్టుల కొరకు ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేద ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 29గా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 21 పోస్టులను భర్తీ చేయనున్నారు.అర్హత, దరఖాస్తు ప్రక్రయ, జీతం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ పోస్టులను పూర్తిగా రైల్వే స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేయనున్నారు. దీని కోసం నోటిఫికేషన్ ను ఇండియన్ రైల్వే జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 29 సెప్టెంబర్ 2022. కాబట్టి దరఖాస్తు ప్రారంభ తేదీ 30 ఆగస్టు 2022 కానుంది. గ్రూప్ C (RRC/ ER/ స్పోర్ట్స్ కోటా) కింది.. మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. కేటగిరి 1 గ్రూప్ సీ పోస్టులు 05, కేటగిరీ 2 గ్రూప్ సీ పోస్టులు 16 ఉన్నాయి.విద్యార్హత విషయానికి వస్తే.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆయా పోస్టుల ప్రకారం ఆగస్టు 12, 2022వ తేదీ వరకు విద్యార్హత పూర్తి చేసి ఉండాలి. అలాగే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా క్రీడల్లో క్రీడాకారుడిగా పాల్గొని ఉండాలి.దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
అయితే దరఖాస్తు రుసుము విషయానికి వస్తే.. జనరల్/OBC/EWS అభ్యర్థులు రూ. 500, SC/ST/ESM/మహిళలు/EBC అభ్యర్థులు రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వద్ద.. రెజ్యూమ్ (బయోడేటా), 10వ, 12వ మరియు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం (వెనుకబడిన తరగతి అభ్యర్థులకు), గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్, లైసెన్స్), పాస్‌పోర్ట్ సైజు ఫోటో దగ్గర ఉంచుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ - 30 ఆగస్టు 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
అలాగే.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విద్యా సంస్థ లేదా విశ్వవిద్యాలయం ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరింత సమాచారం నోటిఫికేషన్‌లో ఇవ్వబడింది.