దేశవ్యాప్తంగా 21 ఫేక్ యూనివర్సిటీలు ఉన్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) శుక్రవారం వెల్లడించింది. ఆ యూనివర్సిటీలు యూజీసీ-19656 చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు తెలిపింది. ఆ వర్సిటీలు ఇచ్చే డిగ్రీలకు విలువ ఉండదని స్పష్టం చేసింది. ఢిల్లీలో 8, యూపీలో 4, పశ్చిమ బెంగాల్‌లో 2, ఒడిశాలో 2, ఏపీ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలలో ఒక్కో ఫేక్ యూనివర్సిటీలు ఉన్నట్లు పేర్కొంది.