పీహెచ్‌డీల విషయంలో యూజీసీ కొత్త మార్గదర్శకాలు ప్రకటించింది. 75 శాతం మార్కులతో 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయిన వారు పీహెచ్‌డీలో చేరొచ్చని తెలిపింది. రెండేళ్ల పీజీ, ఎంఫిల్ 55 శాతం మార్కులతో పూర్తి చేసిన వారు పీహెచ్‌డీకి అర్హులేనని పేర్కొంది. మార్కులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ (నాన్ క్రీమీలేయర్), దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 5 శాతం మినహాయింపు ఉంటుంది. పీహెచ్‌డీని 3 నుంచి 6 ఏళ్లలోపు పూర్తి చేయాలి.