వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి రెండున భద్రాచలంలో జరిగే స్వామివారి ఉత్తరద్వార దర్శన వేడుకకకు సంబంధించి దేవస్థానం టికెట్ల విక్రయాలకు శ్రీకారం చుట్టగా ఆ టికెట్ల అమ్మకాలు మందకొడిగా సాగుతున్నాయి. మొత్తం 3,780 టికెట్లు అందుబాటులో ఉండగా, వీటిలో 150టికెట్లను వీవీఐపీలకు ఉచితంగా అందజేయనున్నారు. మిగిలిన టికెట్లలో 2,350 ఆన్లైన్లో అందుబాటులో ఉంచగా ఇప్పటిరకు 600, ఆఫ్‌లైన్లో 48టికెట్లు మాత్రమే విక్రయించారు. రూ. 2వేలు విలువైన వీఐపీ టికెట్ల 700ఆన్లైన్లో ఉంచగా 237టికెట్లు అమ్ముడయ్యాయి.
రూ.1000 విలువ గల సెక్టారు ఏ టికెట్లు 300 ఉండగా ఇప్పటి వరకు 142 టికెట్లు విక్రయించారు. రూ. 500 విలువగల బీ, సీ, డీ సెక్టారు టికెట్లు 850 ఆన్లైన్లో అందుబాటులో ఉంచగా 184 టికెట్లు మాత్రమే ఇప్పటి వరకు విక్రయించారు. రూ. 250 విలువ గల సెక్టారు-ఈ టికెట్లు 500ఆన్లైన్లో ఉంచగా 37టికెట్లు మాత్రమే భక్తులు కొనుగోలు చేశారు. మరో రెండు వారాల్లో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ప్రారంభం కానుండగా చివరి రోజుల్లో టికెట్ల విక్రయాలు జోరందుకునే అవకాశం ఉందని దేవస్థానం అధికార వర్గాలు భావిస్తున్నాయి.