తల్లి పరాయిపురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. మైసూరు జిల్లా హుణసనాలు చెందిన మహాదేవశెట్టి దంపతులకు మహేంద్ర అనే కుమారుడు ఉన్నాడు. కాగా, మహాదేవశెట్టి భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయంపై దంపతుల మధ్య అనేకసార్లు గొడవ జరిగినా భార్య తీరులో మార్పులేదు. దీంతో ఈ విషయాన్ని తండ్రి కుమారుడి దృష్టికి తీసుకురాగా, మహేంద్ర తల్లితో మాట్లాడాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో సమాజంలో తలెత్తుకుని తిరగలేమని భావించిన మహేంద్ర ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.